మొత్తం పేజీ వీక్షణలు

18, అక్టోబర్ 2014, శనివారం

అదృశ్యం కావాలని ఉందా


     హ్యారీ పొటర్ శ్రేణిలోని పుస్తకాలు మరియు సినిమాలలో చూపబడిన ‘అదృశ్య పరదా’ తయారిలో ఒక అడుగు ముందుకు పడింది. హ్యారీ పొటర్ సినిమానుండి స్పూర్తి పొంది, ఆ సినిమాచూపిన ‘అదృశ్య పరదా’ ను నిజం చేయాలనుకొన్నాడు రోచెస్టర్ విశ్వవిద్యాలయం చెందిన ఒక యువ శస్త్రవేత్త. రోచెస్టర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దృష్టి, పరిసరాలకు, అంతరాయం లేకుండా వస్తువులు దాచే ఒక కటకాన్ని(లెన్స్) అభివృద్ధి చేసారు.




     ఈ ‘అదృశ్య పరదా’కు ‘రోచెస్టర్ క్లోక్’ అని పేరు పెట్టారు, ప్రస్తుతానికి ఇది ధరించడానికి వీలు కాదు. ఈ పరిశోధన ఇంకా అభివ్రుధ్ధి అయితే ‘అదృశ్య పరదా’ నిజం అవుతుంది. మన తెలుగు కధలలొ చాలా సార్లు ఈ అదృశ్యం చేసె కంబళి గురించి చెదివి ఉన్నాము.

     ఈ పరిశోధనలో పాల్గొన్న జోసెఫ్ చోయి (రోచెస్టర్ ఆప్టిక్స్ విభాగములొ ఒక పీహెచ్డీ విద్యార్థి) ఇలా పేర్కొన్నాడు :

     "నిరంతరాయంగా, బహుళకోణలలొ కూడా అదృశ్య చేయగల మొదటి పరికరం ఇది. సాధారణ కాంతి వర్ణమాలలో కూడా ఈ కటకం, అదృశ్య కిరణాలను పంపగలదు"

     అధ్యయనం సమయంలో, పరిశోధకులు ఒక వ్యక్తి చేయి, ఒక వ్యక్తి ముఖం, మరియు ఒక కొలబద్దతొ పరీక్షలు జరిపారు.

     కొత్త సాంకేతికతతొ వైద్యులు శస్త్రచికిత్స సమయంలో వారి చేతులు వెనుక ఏముందో చూస్తూ పనిచేయగలరు, లేదా పెద్ద వాహనాల చోదకులు రహదారిలో ఉన్న మలుపు ఆవల ఏముందొ ముందే చూపడానికు ఉపయోగించ వచ్చు.

     మునుపటి ప్రయత్నాలలో చేసిన ‘అదృశ్య పరదా’లు చేయడానికి చాలా ఖరీదు అయ్యింది, కానీ ‘రోచెస్టర్ పరదా’ మాత్రమే పరిశోధకులు వెయ్యి డాలర్లు (సుమారు 62,000/- రూపాయిలు) ఖర్చుతో పూర్తి చెసారు, భవిష్యత్తులో ఆ ఖర్చు ఇంకా తగ్గుతుంది.

     శాస్త్రవేత్తలు వంద డాలర్లు(సుమారు 6,200/- రూపాయిలు) ఖర్చు తో ఇంట్లో మీ స్వంత ‘రోచెస్టర్ కటకం’ చేయడానికి ఒక వీడియో విడుదల చేసారు చూడండి మరి :





     ఇలాంటి ‘అదృశ్య పరదా’ ఒకటి మీ వద్ద ఇప్పుడు ఉంటె, మోట్ట మొదట మీరు ఏం చెస్తారు ? …… అబ్బ చెప్పండి…..

Invention of invisibility cloak basing o principles of physics has opened doors for many uses in day to day life.  It can be used by doctor while operation on their patients.  In future we may invent an invisible paint which also makes things disappear. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి