నిద్రపొటినికి మంచం మీద మనం వాడుతున్న పరుపులు… అదేనండి(మేట్రెస్) అరోగ్యానికి
మంచివి కావని శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది.
ఈ మధ్యకాలంలో బజారులో దొరికె పరుపులలో, అడుగున కొబ్బరిపీచు, మధ్యన స్పాంజీ,
పైన పాలిస్ట్ ర్ పీచు / నైలాన్ పీచు ఉంటాయి. వీటన్నింటిపైన ఒక అందమైన గుడ్డతొడుగు ఉండనే ఉంటుంది.
ఈ పరుపుల మీద మనం పడుకున్నప్పుడు, మన శరీరానికి పరుపుకీ మధ్య గాలి ప్రసరణలేక,
శరీర ఉష్ణొగ్రత పెరిగి, బాగా చమట పడుతుంది, అయితే ఏంటి? ప్యాను ఉందిగా … అంటారా, చదవండి
మరి.
ఈ వేడిని, చమటను భరించలేక మనం నిద్రలోనే మరో పక్కకు తిరుగుతాము, కొంచెం
సేపటికి, అ పక్క వేడి మరియు చమట పడుతుంది, మరల ఈ పక్కకు తిరగాలి. ఇలా తెల్లవార్లూ పొర్లాడుతూ ఉండాలి నిద్రలో. ఇలా తెల్లవార్లూ పొర్లాడటం వలన మనం గాఢమైన నిద్రలోకి
వెళ్ళలేము, అందుకే ఎన్ని గంటలు నిద్రపోయినా, నిద్ర చాలదు, మెదడుకు అలసట తీరదు. చమట వలన చర్మవ్యాధులు ఏలాగూ ఉచితం.
ఈ నిద్రలేమి లక్షణాలతో, వైద్యుని వద్దకు వెళితే, ఆయన కొన్ని మాత్రలు
బలానికీ, నిద్రకు రాసి పంపుతాడు, వాడినా ప్రయోజనం కనబడదు. పాపం; ఆయనకు మాత్రం ఎలా తెలుస్తుంది
మీరు రాత్రి తెల్లవార్లూ పొర్లాడుతూ ఉంటారని.
అసలు ఆమాటకొస్తే, మీకు మాత్రం ఏం తెలుసు, మీరు రాత్రి ఎన్ని సార్లు అటు ఇటు
తిరిగారో.
అసలు ఈ పరుపు(మేట్రెస్) వాడటం, విదేశాల నుండి మనం అరువు తెచ్చుకున్న
పద్దతి. ప్రతీ ఇంటిలో, ఒక డబల్ కాట్ దానిమీద
పరుపు(మేట్రెస్) ఉండాలని, ఒక అప్రకటిత నియమంగా మారిపోయింది. ఇవి లేకపోతే ఇరుగూ పొరుగూ
మిమ్మలను “ఏమిటీ మీ ఇంటిలో డబల్ కాట్ లేదా……!” అని అడగరూ మరి.
విదేశాలలో, చలిప్రదేశాలలో వారు వాడారంటే అర్ధం ఉంది, కానీ మన వాతావరణ
పరిస్తితులకు తగ్గట్టు మనం చూసుకోవాలి కదా.
మన భారతీయ సాంప్రదాయంలోనే దీనికి బహు
చక్కటి పరిష్కారం ఉంది. నవారు మంచం, మడత మంచం,
నులక మంచం. వీటీపై పడుకుంటే, మధ్య ఉన్న ఖాళీల వలన నిరంతరం శరీరానికి గాలి ప్రవహిస్తుంది. కొంత మెత్తదనం కావలసినవారు వీటి మీద, తక్కువ మందం
ఉన్న దూది పరుపులు వాడుకోవచ్చు (దూది పరుపులు గట్టి పడినపుడు తప్పక ఏకించుకోవాలి సుమా). పూర్వం, ఎంత డబ్బున్నవారైనా, టేకుతో చేయించిన పట్టెమంచం
మీద నవారు అల్లికనే వాడెవారు.
నవారుని, కావలనుకున్నపుడు ఉతకవచ్చు,
అంత ఓపిక లేక పోతే, కొంచెం సెపు ఎండలో పెట్టి దులుపుకున్నా సరిపోతుంది. ఉతకటం, ఎండలో
పెట్టడం వలన ఎన్నో రకాల సూక్ష్మక్రిములు చనిపోతాయి. మరీ…… ఈ కాలం నాటి, డబల్ కాట్ ను
దానిమీద పరుపు(మేట్రెస్)ను ఎంత మంది ఎండలో పెడుతున్నారు, అసలు లేపగలరా వాటిని. మన శరీరానికి
పట్టే చమట పరుపులోకి ఇంకుతుంది. సూక్ష్మజీవులు పెరగటానికి కావలసిన చీకటి, వెచ్చదనం,
తడి మీ పరుపులో పుష్కలంగా ఉన్నాయి. ఆ పరుపు(మేట్రెస్) లో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో
వాటిని పుట్టించిన వాడికే తెలియాలి.
అప్రస్తుతమయినా, ఇక్కడ ఒక మాటచెప్పాలి. ఈ డబల్ కాట్ ఎప్పుడూ పరిచే ఉంటుంది, అలా పరిచి ఉన్నదానిని
చూస్తే మనకు పడుకోవాలనిపిస్తుంది, దీని వలని బద్దకం పెరుగుతుంది, పూర్తి చేయవలసిన పనులు
ఆగిపోతాయి. ఇది తెలిసిన పెద్దలు, పగలు ఇంట్లో
మంచం పరిచి ఉంచటం మంచిది కాదు; శాస్త్రం చెబుతుంది అనేవారు.
ఇంత చదివాక కూడా, మేము, డబల్ కాట్, దానిమీద
పరుపు(మేట్రెస్) వాడుతాము అంటారా……!
మీ ఆరోగ్యం
……… మీ ఇష్టం.
Disadvantages of using sponge mattress for sleeping. These traditional sponge mattress used in India does not allow air flow through them which causes increase in body temperature, sweat resulting in continuous changing of body postures. This results in sleepless nights. A person sleeping on such mattress cannot go into a deep state of sleep. Indian traditional cots are designed with wood and a net of ropes or cotton ribbons which allow proper air flow.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి