పరిశోధకులు త్వరగా చార్జ్ అయ్యె కొత్త లిథియం(మూలకము) బ్యాటరీని
అభివృద్ధి చేసారు. నేటి బ్యాటరీల కంటే 10 రెట్లు
ఎక్కువ మన్నుతుంది. ఇది రెండు సంవత్సరాల లోపు మనకు అందుబాటులో ఉంటుంది.
మీ ఫోన్ చార్జింగ్ కోసం ఒక గంట వేచి చూడవలసిన అవసరం లేకుండా, మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్ళే ముందు, కేవలం 3 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అయ్యె ఒక లిథియం అయాన్ బ్యాటరీని సింగపూర్ లోని నయాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు.
మన మొబైల్
ఫోన్లు, టాబ్లెట్లు
మరియు ల్యాప్టాప్ లలో ఇప్పటికే వాడుకలో ఉన్న రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీలు సాధారణంగా రెండు మూడు సంవత్సరాల మన్నుతాయి మరియు పూర్తిగా ఛార్జ్ అవ్వటానికి రెండు గంటల సమయం పడుతుంది.
ఈ కొత్త బ్యాటరీలు విద్యుత్ వాహనాలను మరింత శక్తివంతం చేస్తాయి. తరచూ కారు బ్యాటరీలను
మార్చె ఖర్చు తగ్గుతుంది. వాహనదారులు
వారి వాహనాలను నిమిషాల్లో
రీఛార్జ్ చేసుకోవచ్చు. దినివలన శిలాజ
ఇంధన వనరుల మీద భారం తగ్గుతుంది. భూగర్భ కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించ
వచ్చు.
ఈ ప్రరిసోధనను ముందుండి నడిపించిన ఆచార్యుడు, చెన్ గ్జియోకడొంగ్ మాట్లాడుతూ "ప్రస్తుతం కార్లలో
పెట్రోల్ నింపుకోటానికి పంపు వద్ద పట్టే సమయంలో, విద్యుత్ కార్లులను పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు" అని చెప్పారు. "ఇప్పుడు వాడుకలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలు పారవేయటం
వలన భూమిలో కలిసే విష వ్యర్థాల శాతాన్ని, ఈ కొత్త బ్యాటరీలు 10 తగ్గించగలవు"
అని కూడా చెన్ చెప్పారు.
శాస్త్రవేత్తలు సంప్రదాయకంగా బ్యాటరీలలో వాడే గ్రాఫైట్ (ఖనిజం) స్థానంలో వారు సృష్టించిన టైటానియం డయాక్సైడ్
సూక్ష్మనాళికలతో తయారైన ఒక కొత్త జిగురు పదార్థముని ఉపయోగించడం వలన ఇది సాధ్యం
అయ్యింది.
ఈ సూక్ష్మనాళికలు, ఒక మానవ
వెంట్రుక కంటే 1000 రెట్లు సన్నగా ఉంటాయి, మరియు ఎలక్ట్రాన్లు
మరియు అయాన్లు వేగవంతగా ప్రవహించడానికి వీలు కలిగిస్తాయి. దీనివలనే వేగవంతమైన
ఛార్జింగ్ వీలు అవుతుంది. వీటీ సూక్ష్మ పరిమాణం వలన
ఎక్కువ శక్తి బ్యాటరీలలోకి
నింపే అవకాశం కలుగుతుంది, అందుకే ఈ క్రొత్త బ్యాటరీ 20 సంవత్సరాలు మన్నుతుంది.
ఇంత మన్నికగల కొత్త బ్యాటరీ బాగా ఖరీదు ఉంటుందేమో అనుకుంటే మీరు పొరబడినట్లే. వీటిని చాలా చౌకగా తయారు చేయవచ్చు ఎందుకంటే, టైటానియం డయాక్సైడ్ మట్టిలో ఇప్పటికే అందుబాటులో ఉంది.
ఈ కొత్త బ్యాటరీలు కలిగిన పరికరాలు మరో రెండు సంవత్సరాలలో మీ చేతిలో
ఉంటాయి.
ఈ వీడియో చూడండిః
Invention of new lithium-ion battery what allow for 70% recharge in 2 minutes. Now mobiles can be charged quickly, in a time which you change dress before going outside. Now, it is the people who need some time to recharge, there will be no rest for your eyes. Mobile phones, laptops and tabs can be replaced with these new batteries.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి