చిట్టీ చిలుకమ్మా
చిట్టీ చిలుకమ్మా,
చిట్టీ చిలుకమ్మా,
అమ్మ కొట్టిందా,
తోటకెళ్లావా,
పండు తెచ్చావా,
గూట్లో పెట్టావా,
గుటుక్కు
మింగావా.
చికు చికు రైలూ
చికు చికు
రైలూ వస్తుంది,
దూరం దూరం
జరగండి,
ఆగినాకా
ఎక్కండి,
జో జో
పాపా ఏడవకు,
లడ్డు
మిఠాయి తినిపిస్తా,
చల్లని
పాలు తాగిస్తా.
చిట్టీ చిట్టీ
మిరియాలు
చిట్టీ
చిట్టీ మిరియాలు చెట్టు కింద పోసి
పుట్టమన్ను
తెచ్చి బొమ్మరిల్లు కట్టి
అల్లంవారి
ఇంటికి చల్లకు పోతే
అల్లంవారి
కుక్క భౌభౌ మన్నది
నా కాలి
గజ్జెలు ఘల్ ఘల్ మన్నవి
చంకలో
పాప క్యార్ క్యార్ మన్నది
పుట్టలో
పాము బుస్ బుస్ మన్నది.
వానా వానా వల్లప్పా
వానా వానా
వల్లప్పా
వాకిలి
తిరుగు చెల్లప్పా
తిరుగు
తిరుగు తిమ్మప్పా
తిరుగలేను
నరసప్పా
మా తాత ఆందం
మా తాత అందం చందమామ
చందం
మా తాత గుండు గుమ్మడి
పండు
మా తాత మీసం రొయ్యల
మీసం
మా తాత పిలక పంచదార
చిలక
బుర్రు పిట్ట బుర్రు పిట్ట
బుర్రు పిట్ట బుర్రు
పిట్ట తుర్రు మన్నది
పడమటింటి కాపురం చెయ్యనన్నది
అత్త తెచ్చిన కొత్త చీర
కట్టనన్నది
మామ తెచ్చిన మల్లె పూలు
ముడవనన్నది
మొగుడు చేత మొట్టికాయ
తింటానన్నది
Telugu rhymes are specially designed for Children to help them to learn Telugu language by play way method.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి