ఇబ్బందికరమైన మరియు అతిపెద్దవైన గుడ్డ గొడుగులుకి ఇక కాలం చెల్లనుందా? చైనా, తమ దేశంలోని విశ్వవిద్యాలయ విద్యార్థులుతో జతకట్టి కోన్ని వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్న
గొడుగు యొక్క రూపం మార్చాలని నిర్ణయించింది. వీరు గాలి శక్తితో పనిచేసే ఒక కొత్త గోడుగుని కనుగొన్నారు.
ప్రస్తుతం వాడుకలో ఉన్న గొడుగులు ఇంకా ఇబ్బందికరంగానే ఉన్నాయి. వర్షాకాలంమంతా,
ఈ గొడుగులును చేతిలొ పట్టుకుని తిరగాలి. గట్టిగా గాలి వీచినప్పుడు ఇవి పైకి తిరగబడతాయి,
ఇక వాటిని, మరలా వెనకకు తిప్పడం ఎంత ఇబ్బందో మనకు తెలియనిదికాదు. వాటికున్న ఇనప సువ్వలు ఎంత మంది కళ్ళలొ గుచ్చుకున్నాయో,
ఎంత మంది తలలకు కన్నాలు పెట్టాయో, అందుకు మనం ఎన్ని తిట్లు తిన్నామో, ఓ సారి గుర్తు
చేసుకోండి. బాగా జనంలో మనం ఉన్నపుడు, గొడుకు
తెరవాలంటె ఎంత ఇబ్బంది. ఇవి
పూర్తిగా తడి ఆరేవరకు లోపలకి తీసుకు పోలేము.
గత రెండు సంవత్సరాలుగా చైనాలోని ఒక బృందం, నాంజింగ్ విశ్వవిద్యాలయ
విధ్యార్ధులతో కలసి, సువ్వలు, గొట్టాలు అసలు గుడ్డకూడా లేకుండా
పనిచేసే ఒక కొత్త రకం గొడుగు కనుగొనడమే
పనిగా పెట్టుకున్నారు. ఇది మీ పైన ఓ గాలి 'క్షేత్రాన్ని' సృష్టించడం ద్వారా వర్షం చినుకులు మీ మీద పడకుండా చేస్తుంది.
ఈ కొత్త గాలి గొడుగు, చేతిలో ఇమిడిపోయే ఓ పరికరం .ఒక లిథియం నిర్జల ఘటం(బ్యాటరీ), ఒక చాలకం(మోటార్), మరియు ఒక గాలిమర ఉంటాయి, ఇవన్ని కలసి బలమైన గాలి ప్రవాహాన్ని ఈ పరికరం పైభాగం నుండి నిరంతరం బయటకు
పంపుతాయి. ఈ గాలి ప్రవాహం, వాన చినుకులని మన మీద పడకుండా పక్కకు నెడుతుంది. ఈ పరికరం ఇద్దరు మనుషులకు సరిగ్గా సరిపొతుంది.
ఈ పరిసోధకుల బృందం అమ్మకానికి మూడు నమూనాలు అభివృద్ధి
చెసింది. 12 అంగుళాల పొడవున్న గొడుగుకు 15 నిమిషాల బ్యాటరీ జీవితం ఉంటుంది.
రెండవ రకం 20 అంగుళాల పొడవున్న గొడుగుకు 30 నిమిషాల బ్యాటరీ జీవితం ఉంటుంది. మూడవ రకం 32 అంగుళాల పొడవున్న గొడుగుకు 30 నిమిషాల బ్యాటరీ జీవితం ఉంటుంది. డిసెంబర్2015 నుండి ఈ ఉత్పత్తులు పంపిణీ ప్రారంభించడానికి
సన్నాహాలు చేస్తున్నారు.
ఈ గాలి గొడుగు ఎలా పని చేస్తుందో ఈ విడియో లొ చూడండిః
ఇది ఫ్రేంచి ప్రరిశోధకుల నమూనాః
అలగే, పనిలో పని, ఒక సాహసి, పేరాషూట్ బదులు గొడుగుతో అకాశంలో తేలుతున్న
ఒక వేడిగాలి బుడగ నుండి దూకితే, అది తేలటానికి సహాయపడుతుందో లేదో
అని ఒక ప్రయోగం చేసాడు. ఏం జరిగిందో చూడండి:
The invention of a new umbrella is under development which uses a jet of air to throw away the rain drops. These umbrellas are electronic gadgets and are portable too.