మొత్తం పేజీ వీక్షణలు

1, డిసెంబర్ 2014, సోమవారం

మీ పాదాలు భూమిని తాకి ఎన్ని రోజులయ్యింది.......చెప్పులు లేకుండా........?

మనం చంద్రుని మీద పాదం తరువాత మోపవచ్చు, అసలు మన పాదాలు నేలను తాకి ఎన్ని రోజులయ్యింది. నేలకు అంటే, మీ ఇంటిలో ఉండే గచ్చుకాదండీ........ మట్టి, నేల, ఇసుక, పచ్చగడ్డి, లాంటివి............. తాకి ఎన్ని రోజులయ్యింది.  అలా చేయపోతే ఏమవుతుందంటా...?  అంటారా........ చదవండి మరి.



ఎందుకు ఒట్టికాళ్ళతో నడవాలి ..........అంటే.........


మన శరీరము నిత్యం విద్యుత్ శక్తిని తాయారు చేస్తుంది.  బ్యాటరీలాగా, మన శరీరం కూడా, రసాయన చర్య ద్వారా విద్యుత్ శక్తిని తాయారు చేస్తుంది. ఈ క్రమంలో నిత్యం మన శరీరంలో ధనావేశం (+ve)  పెరుగుతుంటుంది, తద్వారా, శరీరంలో  ఆక్సీకరణ పెరిగి, కణాలకు, అవయవాలకు, శరీరానికి హానిజరుగుతుంది.


పూర్వం మానవులు, ఎక్కువగా వట్టి కాళ్ళతో తిరిగేవారు లేదా తోలుతో చేసిన చెప్పులు వాడేవారు, పడుకోవటానికి, ప్రకృతిలో దొరికే, గడ్డి, ఆకులతో చాపలు చేసి వాడేవారు, దీనివలన ఆయా పధార్ధాలలోని తేమ వలన భూమిలోని ఎలక్ట్రాన్లు మన శరీరంలోకి ప్రవేసించేవి, తద్వారా...... మన శరీరంలోని విద్యుత్ సమతుల్యంగా ఉండేది.



అధునాతన జీవన సరళి, మనను భూమినుంచి క్రమేణా దూరం చేసేసింది.  1960 ల నుండి మనం రబ్బరు, ప్లాస్టిక్ తో చేయబడిన (చెప్పుల క్రింద ఉంటే సొల్)  చెప్పులను వాడటం మొదలు పెట్టాం, అలాగే, నేల పడక కూడా పోయింది.  దీనివలన, భూమి మీద ఉన్నా, మనం భూమికి దూరం అయ్యాం.



మన శరీరాన్ని, భూమికి తాకించడాన్ని ఈ రోజుల్లో   "ఎర్తింగ్" అని "గ్రౌండింగ్" అని పిలుస్తున్నారు.  ఇలా రోజు కొంత సేపు చేయటం వలన, నిద్రలేమి, వెన్నునెప్పి, పాతనెప్పులు, వత్తిడి నుండి అతి తక్కువ సమయంలో ముక్తి పొందవచ్చు.




మనలో చాలామంది ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా మన ఆరోగ్యం కోసం నడక సాగిస్తున్నాము (అదేనండీ వాకింగ్).  ఇదే పనిలో చిన్న మార్పు చేసి, చెప్పులు / బూట్లు లేకుండా వట్టి కాళ్ళతో నడెస్తే.... ఇప్పుడు మీరు పొందే ఫలితాలు పదింతలవుతాయి.  ఫలితం త్వరగా కనబడుతుంది కూడా.  ఎక్కువ సేపు నడవలేని వాళ్ళు, వారి అరికాళ్ళు మట్టికి తాకెలా రోజూ కొంత సేపు కూర్చున్నా ఫలితం అద్భుతంగా ఉంటుంది.  


ఆ..... ఇప్పుడన్ని తారు రోడ్లేగా వాటిమీద ఒట్టికాళ్ళతో నడిస్తే ఏం ప్రయోజనం అనుకోకండి, వాటిమీద కూడా ఒట్టికాళ్ళతో నడిస్తే శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. వాటిలోని, గులకరాళ్ళూ, తారు, భూమిలోంచి వచ్చినవే కదండీ....... ఎలక్ట్రాన్లు ఎలాంటి ఆటంకం లేకుండా.....మీ శరీరంలోకి ప్రవహిస్తాయి.

ఈ వీడియో ఒకసారి చూడండీః



ఈరోజు ఉన్న ఎన్నోరోగాలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవటమే కారణమని, శాత్రవేత్తలు నెత్తి నోరు బాదుకుంటున్నారు గానీ ఈ విషయం గురించి ప్రస్తావించడంలేదు, ఎవ్వరూ దృష్టి సారించటంలేదు.



This articles discusses about the importance of earthing / grounding of human body.  The flow of free electrons from earth to human body.  The increase in the oxidation in the body due to increase in positive charge.  There is a need to properly ground our body on daily basis. Daily walking barefoot will help to resolve this issue.  It also reduces, stress, copes with sleeplessness, chronic pains and in the balance of cortisol.