మొత్తం పేజీ వీక్షణలు

15, నవంబర్ 2014, శనివారం

నెమలి సంభోగించకుండా గర్భం దాలుస్తుందా.......! ? నిజమేనా......!



సృష్ఠిలో ఏ మలినమూ అంటని, సంభోగించని ప్రాణి నెమలి మాత్రమే అనీ, మగ నెమలి ఆకాశంలొ మబ్బులు పట్టినప్పుడు గానీ, ఆడ నెమలి మీద మనసు పడినప్పుడు గానీ, పురి విప్పి ఆనందంతో నాట్యం చేస్తుంది అనీ, అలా నాట్యం చేస్తున్నప్పుడు మగ నెమలి కంట్లోంచి నీరులాంటి ద్రవం ఉబికి, ఆ ద్రవాన్నే, ఆడ నెమలి మ్రింగి గర్బం ధరిస్తుందనీ, దీనినే 'నేత్రరతి' అంటారని ... అందుకే.... ఈ సృష్ఠిలో  నెమలి అంత పవిత్రమైన జీవి లేదని ఒక ప్రచారం జరుగుతుంది.

ఈ క్రింది వీడియో చూడండిః




నెమళ్ళకు తమ వీర్యాన్ని ఊర్ద్వముఖంగా నడిపించగల శక్తి ఉందనీ, అయితే జ్ఞానంలో మనిషికన్నా ఒక స్ధాయి తక్కువ ఉండుట వలన ఈ వీర్యాన్ని పలుచటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా స్రవించబడి, ఆ స్రావాన్ని ఆడనెమలి తిని, గర్భం ధరిస్తుందనీ (అదే నండీ గుడ్డు పెడుతుంది). అందుకని నెమళ్ళీ అర్ధస్ఖలిత బ్రహ్మచారులనీ ..... ఎప్పటి నుంచో మరో రకమైన విషయం ప్రచారంలో ఉంది.  అయితె........

ఈ క్రింది వీడియో కూడా చూడండిః





నెమలి కూడా కోడిపుంజు మాదిరి సంభోగక్రియలో పాల్గుంటుంది. ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత, ఆడ నెమలి గర్భం దాల్చదు, గుడ్డు పెడుతుంది. 

ఈ సృష్ఠిలోని ప్రాణులన్నీ పవిత్రమైనవే........ ప్రత్యేకంగా నెమలికి పవిత్రత అంట కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వారే చెప్పాలి. 


సంభొగానికి పవిత్రత అవసరమే..... కాని కొంత మంది భోగం అపవిత్రమైన చర్యగా చిత్రీకరించి వాళ్ళకు నచ్చిన అర్ధాలు వ్రాసుకుంటున్నారు.  

రమించకుండా సృష్ఠి ఎలా జరుగుతుంది. 


There is a wide spread myth in India, that peacock is a sacred being because it does not copulate at all.  It is also believed that peacock secrets its sperm from its eyes, then peahen eats it and becomes pregnant, i mean lays eggs.  As these beings do not copulate ( as alleged) these are treated as sacred.  But coming to reality, the above video is self explanatory.  In many Religions in this world, for unknown reasons, Sacredness and sexual intercourse are treated opposite.  
Key words: Peacock, mating, myth, peacock dance, peahen, laying egg, peacock doe not mate, does peacock mate 

7, నవంబర్ 2014, శుక్రవారం

మందుపాతరలను కనుగొని ప్రాణాలు కాపాడుతున్నఎలుకలు

     మందుపాతరలు పలు రకాలు ఉన్నా, వీటిలో, ఒక్క రకం మందుపాతర, చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే, ఇది కొంచెం వత్తిడి తగిలినా ప్రేలుతుంది.  చాలా సందర్భాలలో, ఈ రకం మందుపాతరలు పెడుతున్నవ్యక్తులే చెనిపోయారు.



  రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పాతి పెట్టిన మందుపాతరలు ఇంకా చాలా దేశాలలో అలానే ఉన్నాయి. వాటికి రోజూ ఎవరో ఒకరు బలి అవుతున్నారు. చాలా సంధర్భాలలో చనిపోవటం జరుగుతుంది.  కొంతమంది కాళ్ళను పోగొట్టుకుంటున్నారు. 


  
   వీటిని తీయటానికి ప్రతీ అంగుళం నేలను శోధించవలసినదే. ఎన్నో ప్రయాసలు పడి, ఎంతో ఖర్చు చేసి  పెద్ద పెద్ద పరికరాలు కూడా కనుగొన్నారు.  కాని వాటిని ఉపయోగించడానికి, సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారు కావాలి.  ఆయా పరికరాల కొనుగోలు ఖర్చుకూడా చాలానే ఉంది.



     ఈ మందుపాతరలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో ఇప్పటికీ ఉన్నాయి.  ఈ ఖండంలో ఉన్నవి ఎక్కువ శాతం పేద దేశాలే.  ఈ పరికరాల వ్యయం భరించడం ఆయా దేశాలకు తలకు మించిన భారం. దీని కొరకు వారు ఒక వినూత్న పద్ధతిని కనుగొన్నారు. అదే పెద్ద ఎలుకల (పందికొక్కుల)  వాడకం.



     ఈ ఎలుకలను కొంతమంది పెంచి, వాటికి బాగా శిక్షణ ఇస్తునారు.  కుక్కల మాదిరి వీటికి కూడా మెడకు తోలు పట్టీలు అమర్చి, వాటికి తాడుకట్టి, ఇవి పారిపోకుండా చూస్తారు.  ఇవేగా వారికి జీవనాధారం మరి......



     శిక్షణలో భాగంగా వీటికి మొదట మందుపాతరను వాసన చూపి వెంటనే తినటాని ఏదొకటి పెడతారు. ఇలా కొంతకాలం గడిచాక, మందుపాతరను కొంచం దూరంలో ఉంచి, ఈ ఎలకలను మందుపాతర వరకు నడిపించి మరల వెనకకు నడిపించి, ఆ తరువాత తినటాని తాయిలం పెడతారు. 



     ఇలా కొంత కాలానికి, ఎలుక తనంతట తాను వెళ్ళి మందుపాతరను తాకి, తిరిగి వచ్చి తాయిలం కోసం ఎదురు చూస్తుంది.  ఆ తరువాత, ఈ మందుపాతర కనబడకుండా మట్టిలో పాతిపెడతారు.



     జీవరాశులలో, వాసన పసికట్టే శక్తి కొలమానంగా తీసుకొన్నప్పుడు, ఎలుకలు 6 స్ధానం లో ఉన్నాయి (1.ఎలుగుబంటి, 2.సొరచేప  3.చిమ్మట  4.కుక్క  5.పాము). 

 అందువలన, భూమిలోపల దాగిన ఆహారాన్ని (దుంపలు, గింజలు) ఇవి తేలికగా కనుగొంటాయి.



  ఈ రకం మందుపాతరలు పెట్టేవారు అర అడుగులోతు లోపే పాతాలి లేక పోతే వాటికి వత్తిడి తగలదు, ఇక అవి పేలవు.



   ఇలా శిక్షణ పూర్తి చేసిన ఎలుకలకు తాళ్ళుకట్టి ఒక నిర్దేశిత ప్రాంతం మెత్తం నడెపించే బాధ్యత దాని యజమానిది.  అలా నడుస్తున్నపుడు, మందుపాతరను కనుగొన్న ఎలుక, ఆ చోట త్రవ్వుతుంది.  అదే మందుపాతర ఉన్నట్టు సంకేతం.  వెంటనే ఆ ఎలుకను ఒక చిటిక లాంటి శభ్దంతో పిలిచి, ఆహారాన్ని అందిస్తారు.



  ఎలుకలే ఎందుకు? కుక్కలని ఎప్పటినుంచో  ఇటువంటి పనులకు వాడుతున్నారు కదా అని ఓ సందేహం కలగవచ్చు, ఇలాంటి పనులకి, కుక్కలను వాడితే, వాటి బరువుకి మందుపాతర ప్రేలుతుంది. అదే, ఎలుకలైతే, తేలికగా ఉంటాయి, అవి మందుపాతర మీద ఎక్కినా తక్కువ బరువు వలన అది ప్రేలదు.



 ఎలుకలను, పోషించడం కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీటిని ఉంచడానికి కొంచెం చోటు సరిపోతుంది.



    ప్రకృతితొ కలసి జీవించటానికి ఇదొక మంచి ఉదాహరణ.  మనిషి ఎన్నిఅధునాతన పరికరాలు కనుగొన్నా, ప్రకృతిలొ ఉన్నఏర్పాటు ముందు అవన్ని దిగదుడుపే.

   ఎలుకల పనితీరును ఈ క్రింది విడియోలో చూడండి




* - ఈ వ్యాసం మీకు నచ్చితే, ఫేస్ బుక్ లొ పంచ ప్రార్ధన.

* - వ్రాతపూర్వకమైన తప్పు ఉంటే, క్రింద తెలియజేయగలరు.



The above blog speaks about using rats for detecting landmines in African countries. The training of rats. The cost involved in making high end landmine detecting equipment.  The people who lost their legs in landmine blasts.  The innovatory method of using rats to save the lives of people.

6, నవంబర్ 2014, గురువారం

బయట కొన్న మిఠాయిలు తింటునారా, మెరిసేదంతా వెండికాదు.


     అదేంటి, 'మెరిసేదంతా బంగారం కాదు' అని కదా నానుడి అనుకుంటున్నారా చివరి వరకు చదవండి మరి. 



     పండగలకి, పుట్టినరోజులకి, మనం మిఠాయిలు తింటాం. మన ఆనందాన్ని నలుగురితో పంచాలనుకున్న సంధర్భాలలో మనం మిఠాయిలు పంచుతాం.  అయితే, వాటిని ఇంటి వద్ద తయారు చేసే తీరిక ఈ రోజుల్లొ ఎవరికుంది చెప్పండి.  ఇక, చేసేదేముంది, బయట ఆంగడిలో కొనవలసినదే.  మంచిదే, ఇది ఇప్పుడు సర్వ సాధారణమైన విషయంగా మారింది.


  అయితే, ఈ మిఠాయిల మీద ఉండే వెండి పొర దగ్గరె వచ్చింది సమస్య అంతా.  ఆరోగ్యం కోసం బంగారం, వెండి భస్మ రూపంలో సేవించడం అయుర్వేదంలో చెప్పబడింది.  దీన్ని ఆధారం చేసుకుని, మిఠాయిల మీద వెండి పొరలు అంటించే పద్ధతి చలా ఏళ్ళగా వాడుకలో ఉంది.  ఈ వెండి పొరను 'వర్క్' అని పిలుస్తారు.  వెండి జడ పదార్ధం కనుక ఇది తినటం వలన ఎలాంటి లాభ నష్ఠాలు లేవు. బాగా ఖరీదైన మిఠాయిల మీదే ఇవి దర్శనమిస్తాయి. 
   

    కానీ......ఈ మధ్య కొంతమంది వ్యాపారులు, మిఠాయిల మీద వెండి పొరలకు బదులు కల్తీ చేయబడిన వెండి పొరలను వాడుతున్నారు.  ఈ పొరలలో 'అల్యూమీనియం', 'సీసం', 'నికిల్', 'క్రోమియం', 'కాడ్మియం' వంటి వాటితో కల్తీ చేస్తున్నారు.  దీనివలన కాలేయం, ప్రేగులు, గుండె, మూత్రపిండాలు పాడవుతున్నాయి.


   ఒక్క గ్రాము వెండి ముక్కలను, 'జర్మ్ న్ బటర్ కాగితం' తో చేయబడిన పుస్తకపు ఒక్కొక్క పేజీలో ఉంచి, సుత్తితో మూడు గంటల పాటు బాదితే, అ ఒక్క గ్రాము వెండి ముక్కలు, పల్చటి పొరలా మారుతాయి.  ఆ పొరనే 'వర్క్' అని అంటారు.


    అయితే, ఈ కల్తీ పొరలకి, నిజమైన వెండి పొరలకీ తేడా గుర్తించే పద్ధతి ఒకటుందండీ, అదేంటంటే, మీరు మిఠాయి కొనే ముందు, ఆ మిఠాయి మీది వెండి పొరను కొంచెం తీసుకొని రెండు వేళ్ళ మధ్య నలపాలి. అలా చేసినపుడు, ఆ పొర చిన్న చిన్న ముక్కలుగా విడిపోతే అది వెండి పొర. అలా కాకుండా, చిన్న చిన్న ఉండలుగా మారితే, అది నకిలీది. ఆ నకిలీ పొరలను అంటించిన మిఠాయిలను తిని అనారోగ్యం కొనితెచ్చుకోకండి.



     ఈ మధ్యే 'ఆహార భద్రతా సంస్ధ' వారు దాడులు జరిపి ఇలాంటి నకిలీ వెండి పొరలను అంటించిన మిఠాయిలను అమ్ముతున్న కొన్ని కొట్లను మూయించారు.  వారు మాత్రం ఎన్నెన్ని తనిఖీలు చేస్తారు చెప్పండి.  మనమే జాగ్రత్తగా ఉంటే మంచిది.  ఎక్కువ చిన్న మిఠాయి కొట్టు నడుపుతున్న వారు, ఇలాంటి నకిలీ పొరలను వాడుతున్నారు, ఎందుకంటే ఇవి వెండి వాటితో పోల్చితే నలిలీ పొరలు తక్కువ ధరకు లభిస్తున్నాయి వారికి.

     మరి 'మెరిసేదంతా వెండి కాదు' ................. నిజమేకదా.

Eating sweets which are purchased in outside shops may contain contaminated metal foils.  Usually pure silver foils are used to cover sweets in India.  It is a well known fact as per Ayurveda that consuming Gold, Silver have good affect on health.  These silver foils are called 'Vark' and they are normally made from Silver.  Due to demand and supply, cheap metals like, aluminum, lead, nickle, chromium, cadmium are mixed with silver and such foils are sold to cover theses Sweets in India. 


2, నవంబర్ 2014, ఆదివారం

మీ పళ్ళు తోమటానికి టూత్ బ్రష్, మరి దానిని ఎవరు తోముతారు?


          అవునండి, మనం రోజూ పళ్ళుతోమటానికి వాడే టూత్ బ్రష్ సుక్ష్మక్రిములకి స్వర్గధామం.  పనికి వెళ్ళే హడావుడిలో, గబ గబా పళ్ళుతోమి, బ్రష్ అక్కడ పడేసి పోతాం.  మన పళ్ళలోంచి బ్రష్ లోకి చేరిన సుక్ష్మక్రిములు అక్కడ ఉండే తడిలో వాటి సంతానాన్ని నిముషాలలో లక్షల సంఖ్యలో పేంచుతాయి. మరుసటి ఉదయం మనం టూత్ బ్రష్ ని కుళాయి కింద పెట్టి కడిగినా ఇవి పూర్తిగా పోవు. వీటి వల్ల ఎన్నొరకాల వ్యాధులు వస్తున్నాయని ఆరోగ్య సంస్ధలు గగ్గోలుపెడుతున్నాయి.



ఈ బ్రష్లలో 28 రకాల సుక్ష్మక్రిములు పెరుగుతాయి, వీటిలో చాల మట్టుకు ప్రాణాంతక వ్యాధులు తెచ్చేవే.  అలాగే మనం మరుగుదొడ్డిలో నీరుపోసినపుడు తద్వారా గాలిలొకి కలసిన కొన్ని సుక్ష్మక్రిములు, ఈ బ్రష్ల మీద ఉండె తెమకి వీటి మీద చేరి, పెరుగుతున్నాయి.  ఒక పరిశోధనలొ, బాత్ రూమ్ లో కంటే మనం వాడే టూత్ బ్రష్ ల మీదే 200% ఎక్కువ క్రిములు ఉన్నాయని తేలింది.   వా…మో…!



అందుకే బ్రష్ని కనీసం వారానికి ఒక సారి, హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం లొ కొంచం సేపు నానపేట్టాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ లేని వారు వెనిగర్ వాడవచ్చు.  ఇది కూడాలేనప్పుడు, ఒక గాజు / పింగాణి కప్పులొ బ్రష్ తల మునిగే వరకు నీళ్ళుపోసి, ఒక చంచాడు ఉప్పు వెసి ఒక రాత్రి నానపెట్టాలి.  ఏదైనా వ్యాధితో బాధపడేవారు, ఆ వ్యాధి తగ్గేవరకూ రోజూ ఈ పని చేయాలి. వేడి నీటితో కడగం ద్వారా కూడా చాలా వరకు క్రిములను నివారించుకోవచ్చు.  ఉప్పు బదులు తినే షోడా కూడా వాడోచ్చు.



టూత్ బ్రష్ వాడాక, బాగావిధిలించి మూతపెట్టుకుని దాచుకోవాలి.  బాత్ రూమ్ లో నీరు వాడటం వలన తేమ ఉంటుంది, అందుకే, టూత్ బ్రష్ లు  బాత్ రూమ్ లో పెట్టటం మంచిదికాదని ప్రరిశొధకులు చెబుతున్నారు.  అలాగే, ఒకరి బ్రష్ మరోకరి బ్రష్ కి తగలకుండా వేరుగా పెట్టుకోవాలి. 

ఒక సారి ఈ వీడియో చూడండి


There is a need to clean our tooth brush for every fortnight.  This helps in removal of bacteria from bristles of our tooth brush.  They should be cleaned with Hydrogen Peroxide.  If not available, Vinegar or Salt can be mixed with water and the heads of the toot brush are to be immersed and kept for 2 or 3 hours.  It is also to be ensured that brush are kept dry and properly capped.