మొత్తం పేజీ వీక్షణలు

25, అక్టోబర్ 2014, శనివారం

గొడుగు కాని గొడుగు......... ఈ గాలి గొడుగు

  
     ఇబ్బందికరమైన మరియు అతిపెద్దవైన గుడ్డ గొడుగులుకి ఇక కాలం చెల్లనుందా?  చైనా, తమ దేశంలోని  విశ్వవిద్యాలయ  విద్యార్థులుతో జతకట్టి కోన్ని వేల సంవత్సరాలుగా వాడుకలో ఉన్న గొడుగు యొక్క రూపం మార్చాలని నిర్ణయించింది. వీరు గాలి శక్తితో పనిచేసే ఒక కొత్త గోడుగుని కనుగొన్నారు.


     ప్రస్తుతం వాడుకలో ఉన్న గొడుగులు ఇంకా ఇబ్బందికరంగానే న్నాయి. వర్షాకాలంమంతా, ఈ గొడుగులును చేతిలొ పట్టుకుని తిరగాలి.  గట్టిగా గాలి వీచినప్పుడు ఇవి పైకి తిరగబడతాయి, ఇక వాటిని, మరలా వెనకకు తిప్పడం ఎంత ఇబ్బందో మనకు తెలియనిదికాదు.   వాటికున్న ఇనప సువ్వలు ఎంత మంది కళ్ళలొ గుచ్చుకున్నాయో, ఎంత మంది తలలకు కన్నాలు పెట్టాయో, అందుకు మనం ఎన్ని తిట్లు తిన్నామో, ఓ సారి గుర్తు చేసుకోండి.  బాగా జనంలో మనం ఉన్నపుడు, గొడుకు తెరవాలంటె ఎంత ఇబ్బంది.  ఇవి పూర్తిగా తడి ఆరేవరకు లోపలకి తీసుకు పోలేము.


    
     గత రెండు సంవత్సరాలుగా చైనాలోని ఒక బృందం, నాంజింగ్ విశ్వవిద్యాలయ విధ్యార్ధులతో కలసి, సువ్వలు, గొట్టాలు అసలు గుడ్డకూడా లేకుండా పనిచేసే ఒక కొత్త రకం గొడుగు కనుగొనడమే పనిగా పెట్టుకున్నారు.  ఇది మీ పైన గాలి 'క్షేత్రాన్ని' సృష్టించడం ద్వారా వర్షం చినుకులు మీ మీద పడకుండా చేస్తుంది.



      ఈ కొత్త గాలి గొడుగు, చేతిలో ఇమిడిపోయే పరికరం .ఒక లిథియం నిర్జల ఘటం(బ్యాటరీ), ఒక చాలకం(మోటార్), మరియు ఒక గాలిమర ఉంటాయి, ఇవన్ని కలసి బలమైన గాలి ప్రవాహాన్ని ఈ పరికరం పైభాగం నుండి నిరంతరం బయటకు పంపుతాయి. ఈ గాలి ప్రవాహం, వాన చినుకులని మన మీద పడకుండా పక్కకు నెడుతుంది.  ఈ పరికరం ఇద్దరు మనుషులకు సరిగ్గా సరిపొతుంది.



     ఈ పరిసోధకుల బృందం అమ్మకానికి మూడు నమూనాలు అభివృద్ధి చెసింది.  12 అంగుళాల పొడవున్న గొడుగుకు 15  నిమిషాల బ్యాటరీ జీవితం ఉంటుంది. రెండవ రకం 20 అంగుళాల పొడవున్న గొడుగుకు 30  నిమిషాల బ్యాటరీ జీవితం ఉంటుంది.  మూడవ రకం 32  అంగుళాల పొడవున్న గొడుగుకు 30  నిమిషాల బ్యాటరీ జీవితం ఉంటుంది. డిసెంబర్2015  నుండి ఉత్పత్తులు పంపిణీ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

     ఈ గాలి గొడుగు ఎలా పని చేస్తుందో ఈ విడియో లొ చూడండిః

     
      ఇది ఫ్రేంచి ప్రరిశోధకుల నమూనాః


     అలగే, పనిలో పని, ఒక సాహసి, పేరాషూట్ బదులు గొడుగుతో అకాశంలో తేలుతున్న ఒక వేడిగాలి బుడగ నుండి దూకితే, అది తేలటానికి సహాయపడుతుందో లేదో అని ఒక ప్రయోగం చేసాడు.  ఏం జరిగిందో చూడండి:

The invention of a new umbrella is under development which uses a jet of air to throw away the rain drops.  These umbrellas are electronic gadgets and are portable too.



23, అక్టోబర్ 2014, గురువారం

3 నిముషాలలో పుర్తిగా చార్జ్ అయ్యే బ్యాటరీ, 20 సంవత్సరాలు మన్నుతుంది కూడా…కావాలా..?


     పరిశోధకులు త్వరగా చార్జ్ అయ్యె కొత్త లిథియం(మూలకము) బ్యాటరీని అభివృద్ధి చేసారు.  నేటి బ్యాటరీల కంటే 10 రెట్లు ఎక్కువ మన్నుతుంది. ఇది రెండు సంవత్సరాల లోపు మనకు అందుబాటులో ఉంటుంది.



     మీ ఫోన్ చార్జింగ్ కోసం ఒక గంట వేచి చూడవలసిన అవసరం లేకుండా,  మీరు ఇల్లు వదిలి బయటకు వెళ్ళే ముందు, కేవలం 3 నిమిషాల్లో 100 శాతం చార్జింగ్ అయ్యె ఒక లిథియం అయాన్ బ్యాటరీని సింగపూర్ లోని నయాంగ్ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిశోధకులు కనుగొన్నారు.



     మన మొబైల్ ఫోన్లు, టాబ్లెట్లు మరియు ల్యాప్టాప్ లలో ఇప్పటికే వాడుకలో ఉన్న రీఛార్జబుల్ లిథియం అయాన్ బ్యాటరీలు సాధారణంగా రెండు మూడు సంవత్సరాల మన్నుతాయి మరియు పూర్తిగా ఛార్జ్ అవ్వటానికి రెండు గంటల సమయం పడుతుంది.




     ఈ కొత్త బ్యాటరీలు విద్యుత్ వాహనాలను మరింత శక్తివంతం చేస్తాయి.  తరచూ కారు బ్యాటరీలను మార్చె ఖర్చు గ్గుతుంది. వాహనదారులు వారి వాహనాలను నిమిషాల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు.  దినివలన శిలాజ ఇంధన వనరుల మీద భారం తగ్గుతుంది.  భూగర్భ కాలుష్యాన్ని కూడా గణనీయంగా తగ్గించ వచ్చు.





     ఈ ప్రరిసోధనను ముందుండి నడిపించిన ఆచార్యుడు, చెన్ గ్జియోకడొంగ్ మాట్లాడుతూ "ప్రస్తుతం కార్లలో పెట్రోల్ నింపుకోటానికి పంపు వద్ద పట్టే సమయంలో, విద్యుత్ కార్లులను పూర్తిగా ఛార్జింగ్ చేయవచ్చు"  అని చెప్పారు. "ఇప్పుడు వాడుకలో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీలు  పారవేయటం వలన భూమిలో కలిసే విష వ్యర్థాల శాతాన్ని, ఈ కొత్త  బ్యాటరీలు  10 తగ్గించగలవు" అని కూడా చెన్ చెప్పారు.



     శాస్త్రవేత్తలు సంప్రదాయకంగా బ్యాటరీలలో వాడే గ్రాఫైట్ (ఖనిజం) స్థానంలో వారు సృష్టించిన టైటానియం డయాక్సైడ్ సూక్ష్మనాళికలతో తయారైన ఒక కొత్త జిగురు పదార్థముని ఉపయోగించడం వలన ఇది సాధ్యం అయ్యింది.




      సూక్ష్మనాళికలు, ఒక మానవ వెంట్రుక కంటే 1000 రెట్లు సన్నగా ఉంటాయి, మరియు ఎలక్ట్రాన్లు మరియు అయాన్లు వేగవంతగా ప్రవహించడానికి వీలు కలిగిస్తాయి. దీనివలనే వేగవంతమైన ఛార్జింగ్ వీలు అవుతుంది.  వీటీ సూక్ష్మ పరిమాణం వలన ఎక్కువ శక్తి బ్యాటరీలలోకి నింపే అవకాశం కలుగుతుంది, అందుకే ఈ క్రొత్త బ్యాటరీ 20 సంవత్సరాలు మన్నుతుంది.



ఇంత మన్నికగల కొత్త బ్యాటరీ బాగా ఖరీదు ఉంటుందేమో అనుకుంటే మీరు పొరబడినట్లే.  వీటిని చాలా చౌకగా తయారు చేయవచ్చు ఎందుకంటే, టైటానియం డయాక్సైడ్ మట్టిలో ఇప్పటికే అందుబాటులో ఉంది.  ఈ కొత్త బ్యాటరీలు కలిగిన పరికరాలు మరో రెండు సంవత్సరాలలో మీ చేతిలో ఉంటాయి.

ఈ వీడియో చూడండిః


Invention of new lithium-ion battery what allow for 70% recharge in 2 minutes.  Now mobiles can be charged quickly, in a time which you change dress before going outside.  Now, it is the people who need some time to recharge, there will be no rest for your eyes. Mobile phones, laptops and tabs can be replaced with these new batteries. 


20, అక్టోబర్ 2014, సోమవారం

నిద్రపొటానికి పరుపు (మేట్రెస్) వాడుతున్నారా ……! ఆరోగ్యానికి మంచిదెనా ? ఒక సారి చదవి మీరే చెప్పండి.

నిద్రపొటినికి మంచం మీద మనం వాడుతున్న పరుపులు… అదేనండి(మేట్రెస్) అరోగ్యానికి మంచివి కావని శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. 




ఈ మధ్యకాలంలో బజారులో దొరికె పరుపులలో, అడుగున కొబ్బరిపీచు, మధ్యన స్పాంజీ, పైన పాలిస్ట్ ర్ పీచు / నైలాన్ పీచు ఉంటాయి.  వీటన్నింటిపైన ఒక అందమైన గుడ్డతొడుగు ఉండనే ఉంటుంది.


ఈ పరుపుల మీద మనం పడుకున్నప్పుడు, మన శరీరానికి పరుపుకీ మధ్య గాలి ప్రసరణలేక, శరీర ఉష్ణొగ్రత పెరిగి, బాగా చమట పడుతుంది, అయితే ఏంటి? ప్యాను ఉందిగా … అంటారా, చదవండి మరి.



ఈ వేడిని, చమటను భరించలేక మనం నిద్రలోనే మరో పక్కకు తిరుగుతాము, కొంచెం సేపటికి, అ పక్క వేడి మరియు చమట పడుతుంది, మరల ఈ పక్కకు తిరగాలి.  ఇలా తెల్లవార్లూ పొర్లాడుతూ ఉండాలి నిద్రలో.  ఇలా తెల్లవార్లూ పొర్లాడటం వలన మనం గాఢమైన నిద్రలోకి వెళ్ళలేము, అందుకే ఎన్ని గంటలు నిద్రపోయినా, నిద్ర చాలదు, మెదడుకు అలసట తీరదు.  చమట వలన చర్మవ్యాధులు ఏలాగూ ఉచితం.



ఈ నిద్రలేమి లక్షణాలతో, వైద్యుని వద్దకు వెళితే, ఆయన కొన్ని మాత్రలు బలానికీ, నిద్రకు రాసి పంపుతాడు, వాడినా ప్రయోజనం కనబడదు. పాపం; ఆయనకు మాత్రం ఎలా తెలుస్తుంది మీరు రాత్రి తెల్లవార్లూ పొర్లాడుతూ ఉంటారని.  అసలు ఆమాటకొస్తే, మీకు మాత్రం ఏం తెలుసు, మీరు రాత్రి ఎన్ని సార్లు అటు ఇటు తిరిగారో.


అసలు ఈ పరుపు(మేట్రెస్) వాడటం, విదేశాల నుండి మనం అరువు తెచ్చుకున్న పద్దతి.  ప్రతీ ఇంటిలో, ఒక డబల్ కాట్ దానిమీద పరుపు(మేట్రెస్) ఉండాలని, ఒక అప్రకటిత నియమంగా మారిపోయింది. ఇవి లేకపోతే ఇరుగూ పొరుగూ మిమ్మలను “ఏమిటీ మీ ఇంటిలో డబల్ కాట్ లేదా……!” అని అడగరూ మరి.

విదేశాలలో, చలిప్రదేశాలలో వారు వాడారంటే అర్ధం ఉంది, కానీ మన వాతావరణ పరిస్తితులకు తగ్గట్టు మనం చూసుకోవాలి కదా. 



               మన భారతీయ సాంప్రదాయంలోనే దీనికి బహు చక్కటి పరిష్కారం ఉంది.  నవారు మంచం, మడత మంచం, నులక మంచం. వీటీపై పడుకుంటే, మధ్య ఉన్న ఖాళీల వలన నిరంతరం శరీరానికి గాలి ప్రవహిస్తుంది.  కొంత మెత్తదనం కావలసినవారు వీటి మీద, తక్కువ మందం ఉన్న దూది పరుపులు వాడుకోవచ్చు (దూది పరుపులు గట్టి పడినపుడు తప్పక ఏకించుకోవాలి సుమా).  పూర్వం, ఎంత డబ్బున్నవారైనా, టేకుతో చేయించిన పట్టెమంచం మీద నవారు అల్లికనే వాడెవారు.

               నవారుని, కావలనుకున్నపుడు ఉతకవచ్చు, అంత ఓపిక లేక పోతే, కొంచెం సెపు ఎండలో పెట్టి దులుపుకున్నా సరిపోతుంది. ఉతకటం, ఎండలో పెట్టడం వలన ఎన్నో రకాల సూక్ష్మక్రిములు చనిపోతాయి. మరీ…… ఈ కాలం నాటి, డబల్ కాట్ ను దానిమీద పరుపు(మేట్రెస్)ను ఎంత మంది ఎండలో పెడుతున్నారు, అసలు లేపగలరా వాటిని.  మన శరీరానికి పట్టే చమట పరుపులోకి ఇంకుతుంది. సూక్ష్మజీవులు పెరగటానికి కావలసిన చీకటి, వెచ్చదనం, తడి మీ పరుపులో పుష్కలంగా ఉన్నాయి.    ఆ పరుపు(మేట్రెస్) లో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో వాటిని పుట్టించిన వాడికే తెలియాలి.

               అప్రస్తుతమయినా, ఇక్కడ ఒక మాటచెప్పాలి.  ఈ డబల్ కాట్ ఎప్పుడూ పరిచే ఉంటుంది, అలా పరిచి ఉన్నదానిని చూస్తే మనకు పడుకోవాలనిపిస్తుంది, దీని వలని బద్దకం పెరుగుతుంది, పూర్తి చేయవలసిన పనులు ఆగిపోతాయి.  ఇది తెలిసిన పెద్దలు, పగలు ఇంట్లో మంచం పరిచి ఉంచటం మంచిది కాదు; శాస్త్రం చెబుతుంది అనేవారు.

               ఇంత చదివాక కూడా, మేము, డబల్ కాట్, దానిమీద పరుపు(మేట్రెస్) వాడుతాము అంటారా……!

మీ ఆరోగ్యం ……… మీ ఇష్టం.
Disadvantages of using sponge mattress for sleeping.  These traditional sponge mattress used in India does not allow air flow through them which causes increase in body temperature, sweat resulting in continuous changing of body postures.  This results in sleepless nights.  A person sleeping on such mattress cannot go into a deep state of sleep.  Indian traditional cots are designed with wood and a net of ropes or cotton ribbons which allow proper air flow.