మొత్తం పేజీ వీక్షణలు

7, నవంబర్ 2014, శుక్రవారం

మందుపాతరలను కనుగొని ప్రాణాలు కాపాడుతున్నఎలుకలు

     మందుపాతరలు పలు రకాలు ఉన్నా, వీటిలో, ఒక్క రకం మందుపాతర, చాలా ప్రమాదకరమైనది, ఎందుకంటే, ఇది కొంచెం వత్తిడి తగిలినా ప్రేలుతుంది.  చాలా సందర్భాలలో, ఈ రకం మందుపాతరలు పెడుతున్నవ్యక్తులే చెనిపోయారు.



  రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో పాతి పెట్టిన మందుపాతరలు ఇంకా చాలా దేశాలలో అలానే ఉన్నాయి. వాటికి రోజూ ఎవరో ఒకరు బలి అవుతున్నారు. చాలా సంధర్భాలలో చనిపోవటం జరుగుతుంది.  కొంతమంది కాళ్ళను పోగొట్టుకుంటున్నారు. 


  
   వీటిని తీయటానికి ప్రతీ అంగుళం నేలను శోధించవలసినదే. ఎన్నో ప్రయాసలు పడి, ఎంతో ఖర్చు చేసి  పెద్ద పెద్ద పరికరాలు కూడా కనుగొన్నారు.  కాని వాటిని ఉపయోగించడానికి, సాంకేతిక పరిజ్ఞానం కలిగినవారు కావాలి.  ఆయా పరికరాల కొనుగోలు ఖర్చుకూడా చాలానే ఉంది.



     ఈ మందుపాతరలు ఎక్కువగా ఆఫ్రికా ఖండంలో ఇప్పటికీ ఉన్నాయి.  ఈ ఖండంలో ఉన్నవి ఎక్కువ శాతం పేద దేశాలే.  ఈ పరికరాల వ్యయం భరించడం ఆయా దేశాలకు తలకు మించిన భారం. దీని కొరకు వారు ఒక వినూత్న పద్ధతిని కనుగొన్నారు. అదే పెద్ద ఎలుకల (పందికొక్కుల)  వాడకం.



     ఈ ఎలుకలను కొంతమంది పెంచి, వాటికి బాగా శిక్షణ ఇస్తునారు.  కుక్కల మాదిరి వీటికి కూడా మెడకు తోలు పట్టీలు అమర్చి, వాటికి తాడుకట్టి, ఇవి పారిపోకుండా చూస్తారు.  ఇవేగా వారికి జీవనాధారం మరి......



     శిక్షణలో భాగంగా వీటికి మొదట మందుపాతరను వాసన చూపి వెంటనే తినటాని ఏదొకటి పెడతారు. ఇలా కొంతకాలం గడిచాక, మందుపాతరను కొంచం దూరంలో ఉంచి, ఈ ఎలకలను మందుపాతర వరకు నడిపించి మరల వెనకకు నడిపించి, ఆ తరువాత తినటాని తాయిలం పెడతారు. 



     ఇలా కొంత కాలానికి, ఎలుక తనంతట తాను వెళ్ళి మందుపాతరను తాకి, తిరిగి వచ్చి తాయిలం కోసం ఎదురు చూస్తుంది.  ఆ తరువాత, ఈ మందుపాతర కనబడకుండా మట్టిలో పాతిపెడతారు.



     జీవరాశులలో, వాసన పసికట్టే శక్తి కొలమానంగా తీసుకొన్నప్పుడు, ఎలుకలు 6 స్ధానం లో ఉన్నాయి (1.ఎలుగుబంటి, 2.సొరచేప  3.చిమ్మట  4.కుక్క  5.పాము). 

 అందువలన, భూమిలోపల దాగిన ఆహారాన్ని (దుంపలు, గింజలు) ఇవి తేలికగా కనుగొంటాయి.



  ఈ రకం మందుపాతరలు పెట్టేవారు అర అడుగులోతు లోపే పాతాలి లేక పోతే వాటికి వత్తిడి తగలదు, ఇక అవి పేలవు.



   ఇలా శిక్షణ పూర్తి చేసిన ఎలుకలకు తాళ్ళుకట్టి ఒక నిర్దేశిత ప్రాంతం మెత్తం నడెపించే బాధ్యత దాని యజమానిది.  అలా నడుస్తున్నపుడు, మందుపాతరను కనుగొన్న ఎలుక, ఆ చోట త్రవ్వుతుంది.  అదే మందుపాతర ఉన్నట్టు సంకేతం.  వెంటనే ఆ ఎలుకను ఒక చిటిక లాంటి శభ్దంతో పిలిచి, ఆహారాన్ని అందిస్తారు.



  ఎలుకలే ఎందుకు? కుక్కలని ఎప్పటినుంచో  ఇటువంటి పనులకు వాడుతున్నారు కదా అని ఓ సందేహం కలగవచ్చు, ఇలాంటి పనులకి, కుక్కలను వాడితే, వాటి బరువుకి మందుపాతర ప్రేలుతుంది. అదే, ఎలుకలైతే, తేలికగా ఉంటాయి, అవి మందుపాతర మీద ఎక్కినా తక్కువ బరువు వలన అది ప్రేలదు.



 ఎలుకలను, పోషించడం కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీటిని ఉంచడానికి కొంచెం చోటు సరిపోతుంది.



    ప్రకృతితొ కలసి జీవించటానికి ఇదొక మంచి ఉదాహరణ.  మనిషి ఎన్నిఅధునాతన పరికరాలు కనుగొన్నా, ప్రకృతిలొ ఉన్నఏర్పాటు ముందు అవన్ని దిగదుడుపే.

   ఎలుకల పనితీరును ఈ క్రింది విడియోలో చూడండి




* - ఈ వ్యాసం మీకు నచ్చితే, ఫేస్ బుక్ లొ పంచ ప్రార్ధన.

* - వ్రాతపూర్వకమైన తప్పు ఉంటే, క్రింద తెలియజేయగలరు.



The above blog speaks about using rats for detecting landmines in African countries. The training of rats. The cost involved in making high end landmine detecting equipment.  The people who lost their legs in landmine blasts.  The innovatory method of using rats to save the lives of people.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి