అదేంటి, 'మెరిసేదంతా బంగారం కాదు' అని కదా నానుడి అనుకుంటున్నారా చివరి వరకు చదవండి మరి.
పండగలకి, పుట్టినరోజులకి, మనం మిఠాయిలు తింటాం. మన ఆనందాన్ని నలుగురితో పంచాలనుకున్న సంధర్భాలలో మనం మిఠాయిలు పంచుతాం. అయితే, వాటిని ఇంటి వద్ద తయారు చేసే తీరిక ఈ రోజుల్లొ ఎవరికుంది చెప్పండి. ఇక, చేసేదేముంది, బయట ఆంగడిలో కొనవలసినదే. మంచిదే, ఇది ఇప్పుడు సర్వ సాధారణమైన విషయంగా మారింది.
అయితే, ఈ మిఠాయిల మీద ఉండే వెండి పొర దగ్గరె వచ్చింది సమస్య అంతా. ఆరోగ్యం కోసం బంగారం, వెండి భస్మ రూపంలో సేవించడం అయుర్వేదంలో చెప్పబడింది. దీన్ని ఆధారం చేసుకుని, మిఠాయిల మీద వెండి పొరలు అంటించే పద్ధతి చలా ఏళ్ళగా వాడుకలో ఉంది. ఈ వెండి పొరను 'వర్క్' అని పిలుస్తారు. వెండి జడ పదార్ధం కనుక ఇది తినటం వలన ఎలాంటి లాభ నష్ఠాలు లేవు. బాగా ఖరీదైన మిఠాయిల మీదే ఇవి దర్శనమిస్తాయి.
కానీ......ఈ మధ్య కొంతమంది వ్యాపారులు, మిఠాయిల మీద వెండి పొరలకు బదులు కల్తీ చేయబడిన వెండి పొరలను వాడుతున్నారు. ఈ పొరలలో 'అల్యూమీనియం', 'సీసం', 'నికిల్', 'క్రోమియం', 'కాడ్మియం' వంటి వాటితో కల్తీ చేస్తున్నారు. దీనివలన కాలేయం, ప్రేగులు, గుండె, మూత్రపిండాలు పాడవుతున్నాయి.
ఒక్క గ్రాము వెండి ముక్కలను, 'జర్మ్ న్ బటర్ కాగితం' తో చేయబడిన పుస్తకపు ఒక్కొక్క పేజీలో ఉంచి, సుత్తితో మూడు గంటల పాటు బాదితే, అ ఒక్క గ్రాము వెండి ముక్కలు, పల్చటి పొరలా మారుతాయి. ఆ పొరనే 'వర్క్' అని అంటారు.

అయితే, ఈ కల్తీ పొరలకి, నిజమైన వెండి పొరలకీ తేడా గుర్తించే పద్ధతి ఒకటుందండీ, అదేంటంటే, మీరు మిఠాయి కొనే ముందు, ఆ మిఠాయి మీది వెండి పొరను కొంచెం తీసుకొని రెండు వేళ్ళ మధ్య నలపాలి. అలా చేసినపుడు, ఆ పొర చిన్న చిన్న ముక్కలుగా విడిపోతే అది వెండి పొర. అలా కాకుండా, చిన్న చిన్న ఉండలుగా మారితే, అది నకిలీది. ఆ నకిలీ పొరలను అంటించిన మిఠాయిలను తిని అనారోగ్యం కొనితెచ్చుకోకండి.
ఈ మధ్యే 'ఆహార భద్రతా సంస్ధ' వారు దాడులు జరిపి ఇలాంటి నకిలీ వెండి పొరలను అంటించిన మిఠాయిలను అమ్ముతున్న కొన్ని కొట్లను మూయించారు. వారు మాత్రం ఎన్నెన్ని తనిఖీలు చేస్తారు చెప్పండి. మనమే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎక్కువ చిన్న మిఠాయి కొట్టు నడుపుతున్న వారు, ఇలాంటి నకిలీ పొరలను వాడుతున్నారు, ఎందుకంటే ఇవి వెండి వాటితో పోల్చితే నలిలీ పొరలు తక్కువ ధరకు లభిస్తున్నాయి వారికి.
మరి 'మెరిసేదంతా వెండి కాదు' ................. నిజమేకదా.
Eating sweets which are purchased in outside shops may contain contaminated metal foils. Usually pure silver foils are used to cover sweets in India. It is a well known fact as per Ayurveda that consuming Gold, Silver have good affect on health. These silver foils are called 'Vark' and they are normally made from Silver. Due to demand and supply, cheap metals like, aluminum, lead, nickle, chromium, cadmium are mixed with silver and such foils are sold to cover theses Sweets in India.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి