సృష్ఠిలో ఏ మలినమూ అంటని, సంభోగించని ప్రాణి నెమలి మాత్రమే అనీ, మగ నెమలి ఆకాశంలొ మబ్బులు పట్టినప్పుడు గానీ, ఆడ నెమలి మీద మనసు పడినప్పుడు గానీ, పురి విప్పి ఆనందంతో నాట్యం చేస్తుంది అనీ, అలా నాట్యం చేస్తున్నప్పుడు మగ నెమలి కంట్లోంచి నీరులాంటి ద్రవం ఉబికి, ఆ ద్రవాన్నే, ఆడ నెమలి మ్రింగి గర్బం ధరిస్తుందనీ, దీనినే 'నేత్రరతి' అంటారని ... అందుకే.... ఈ సృష్ఠిలో నెమలి అంత పవిత్రమైన జీవి లేదని ఒక ప్రచారం జరుగుతుంది.
ఈ క్రింది వీడియో చూడండిః
నెమళ్ళకు తమ వీర్యాన్ని ఊర్ద్వముఖంగా నడిపించగల శక్తి ఉందనీ, అయితే జ్ఞానంలో మనిషికన్నా ఒక స్ధాయి తక్కువ ఉండుట వలన ఈ వీర్యాన్ని పలుచటి జిగురు రూపంలో కంటిలోని గ్రంధుల ద్వారా స్రవించబడి, ఆ స్రావాన్ని ఆడనెమలి తిని, గర్భం ధరిస్తుందనీ (అదే నండీ గుడ్డు పెడుతుంది). అందుకని నెమళ్ళీ అర్ధస్ఖలిత బ్రహ్మచారులనీ ..... ఎప్పటి నుంచో మరో రకమైన విషయం ప్రచారంలో ఉంది. అయితె........
ఈ క్రింది వీడియో కూడా చూడండిః
నెమలి కూడా కోడిపుంజు మాదిరి సంభోగక్రియలో పాల్గుంటుంది. ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాత, ఆడ నెమలి గర్భం దాల్చదు, గుడ్డు పెడుతుంది.
ఈ సృష్ఠిలోని ప్రాణులన్నీ పవిత్రమైనవే........ ప్రత్యేకంగా నెమలికి పవిత్రత అంట కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వారే చెప్పాలి.
సంభొగానికి పవిత్రత అవసరమే..... కాని కొంత మంది భోగం అపవిత్రమైన చర్యగా చిత్రీకరించి వాళ్ళకు నచ్చిన అర్ధాలు వ్రాసుకుంటున్నారు.
ఈ సృష్ఠిలోని ప్రాణులన్నీ పవిత్రమైనవే........ ప్రత్యేకంగా నెమలికి పవిత్రత అంట కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో వారే చెప్పాలి.
సంభొగానికి పవిత్రత అవసరమే..... కాని కొంత మంది భోగం అపవిత్రమైన చర్యగా చిత్రీకరించి వాళ్ళకు నచ్చిన అర్ధాలు వ్రాసుకుంటున్నారు.
రమించకుండా సృష్ఠి ఎలా జరుగుతుంది.
There is a wide spread myth in India, that peacock is a sacred being because it does not copulate at all. It is also believed that peacock secrets its sperm from its eyes, then peahen eats it and becomes pregnant, i mean lays eggs. As these beings do not copulate ( as alleged) these are treated as sacred. But coming to reality, the above video is self explanatory. In many Religions in this world, for unknown reasons, Sacredness and sexual intercourse are treated opposite.
Key words: Peacock, mating, myth, peacock dance, peahen, laying egg, peacock doe not mate, does peacock mate